కొడుకుతో కలిసి తండ్రికి వైఎస్ షర్మిల నివాళి!... వైఎస్సార్ మనవడి ఫొటో ఇదిగో!
- తల్లి షర్మిలతో కలిసి తాతకు రాజారెడ్డి నివాళి
- ఇడుపులపాయలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైఎస్సార్ మనవడు
- హైదరాబాద్‌లో రాజారెడ్డిని చూసేందుకు ఎగబడ్డ వైఎస్సార్టీపీ శ్రేణులు
వైఎస్సార్ ఘాట్‌లో కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం షర్మిల తన పిల్లలతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం పంజాగుట్టలోని వైఎస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి ఆమె తన తండ్రికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కూడా తల్లి వెంటే తాత విగ్రహం వద్దకు వచ్చిన రాజా రెడ్డి వైఎస్సార్టీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. షర్మిల తనయుడిని చూసేందుకు పార్టీ శ్రేణులు అమితాసక్తి కనబరచారు.