Ram: అంతకుమించి అంటున్న బోయపాటి!

  • 'అఖండ'తో భారీ హిట్ అందుకున్న బోయపాటి
  • రామ్ హీరోగా నెక్స్ట్ మూవీకి సన్నాహాలు  
  • ద్విపాత్రాభినయం చేయనున్న రామ్
  • త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు  
Ram and Boyapati movie update

బోయపాటి సినిమా అనగానే మాస్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందనే విషయంలో ఆడియన్స్ కి అంచనాలు ఉన్నాయి. ఆయన సినిమాల్లో యాక్షన్ అంతా కూడా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. అందువలన అవి ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అవుతుంటాయి. ఇదే విషయాన్ని 'అఖండ' మరోసారి నిరూపించింది.

ఆ తరువాత సినిమాను ఆయన రామ్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరువుకుంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ప్రేక్షకులను విస్మయులను చేసేదిగా ఉంటుందని అంటున్నారు. 

'అఖండ' తరువాత బోయపాటి చేస్తున్న సినిమా కనుక, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతకుమించి అన్నట్టుగానే ఈ సినిమా ఉంటుందని ఆయన బలంగా చెబుతున్నాడు. ఈ నెల 14వ తేదీన రామ్ మూవీ 'ది వారియర్' రిలీజ్ కాగానే, ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లోని సినిమా సెట్స్  పైకి వెళ్లనుంది..

More Telugu News