Prakash Raj: మోదీ సుప్రీం యాక్ట‌ర్ అంటూ ప్ర‌కాశ్ రాజ్ సెటైర్‌!

prakash raj satires on pm narendra modi
షార్ట్స్‌లో చూడండి
బీజేపీపైనా, ప్ర‌త్యేకించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపైనా అవ‌కాశం చిక్కిన ప్ర‌తిసారీ సెటైర్లు సంధిస్తూ వ‌స్తున్న బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తాజాగా మంగ‌ళ‌వారం సాయంత్రం ఓ సెటైరిక‌ల్ ట్వీట్ సంధించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని సుప్రీం యాక్ట‌ర్, డైరెక్ట‌ర్‌గా అభివ‌ర్ణిస్తూ ఆయ‌న స‌ద‌రు ట్వీట్‌ను పోస్ట్ చేశారు. కెమెరాల ముందుకు వ‌చ్చిన‌ప్పుడు మ‌న సుప్రీం యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్‌ను ఎవ‌రైనా బీట్ చేయ‌గ‌ల‌రా? అంటూ ప్ర‌కాశ్ రాజ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. త‌న ట్వీట్‌కు తానే మొద‌లుపెట్టిన‌ జ‌స్ట్ ఆస్కింగ్ అనే ట్యాగ్‌ను కూడా ఆయ‌న జ‌త చేశారు.

ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌కు మోదీకి చెందిన ఓ వీడియో క్లిప్పింగ్‌ను కూడా జ‌త చేశారు. టీవీ9కు చెందిన‌ 22 సెక‌న్ల నిడివి ఉన్న ఆ వీడియోలో ఏదో కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వ‌స్తున్న మోదీని త‌మ కెమెరాల్లో బంధించేందుకు అప్ప‌టికే కెమెరామెన్లు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండ‌గా... ఆ కెమెరాల ముందుకు ఓ వ్య‌క్తి వ‌చ్చి మోదీకి అభివాదం చేసేందుకు య‌త్నించారు. అయితే ఆ వ్య‌క్తిని వెన‌క్కు వెళ్లాల‌ని సూచించిన మోదీ... కెమెరాల‌కు అత‌డు దూరంగా జ‌రిగిన త‌ర్వాత ఆ వ్య‌క్తికి అభివాదం చేస్తూ మోదీ సాగారు.
Go Back to Shorts
Prakash Raj
Prime Minister
Narendra Modi
Twitter

More Telugu News