Madhya Pradesh: స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన దుర్మార్గులు

Two perrsons raped their friend and live streamed
  • మధ్యప్రదేశ్ లో దారుణ ఘటన
  • అత్యాచారం ఘటనను సోషల్ మీడియాలో కూడా పెట్టిన వైనం
  • పరారీలో అత్యాచారం నిందితులు
ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితులిద్దరు అత్యాచారం చేశారు. అంతేకాదు అత్యాచారాన్ని తమ మరో స్నేహితుడి కోసం లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. గత ఏడాదిగా ఆమెను బలవంతంగా అనుభవిస్తున్నారు. 

మరోవైపు ఇటీవలే బాధితురాలికి ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి వీరు పంపించారు. దీంతో వీరి పెళ్లి రద్దు అయింది. ఈ క్రమంలో తమ కూతురుకి జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. 2021 జూన్ 2న తనను హోటల్ కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పేర్కొంది. అత్యాచారం సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలను ఆ తర్వాత వాళ్లు సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని తెలిపింది. ఈ విషయం గురించి బయటకు చెపితే... తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని హెచ్చరించారని చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Madhya Pradesh
Rape
Live Streaming

More Telugu News