భారీ యాక్షన్ సినిమా కోసం రెడీ అవుతున్న వరుణ్ తేజ్!
- 'ఎఫ్ 3'తో హిట్ కొట్టిన వరుణ్
- నెక్స్ట్ మూవీ ప్రవీణ్ సత్తారుతో
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- త్వరలోనే సెట్స్ పైకి వెళుతున్న ప్రాజెక్టు
ఆ తరువాత వరుణ్ తేజ్ చేసిన 'ఎఫ్ 3' సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. వరుణ్ తేజ్ కి మంచి హిట్ తెచ్చిపెట్టింది. ఇక ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు ప్రవీణ్ సత్తారుతో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.
నాగార్జున హీరోగా 'ది ఘోస్ట్' సినిమాను రూపొందించిన ప్రవీణ్, ఆ సినిమాను రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాగానే ఆయన ఈ సినిమాపైకి రానున్నాడని అంటున్నారు. ఇది కూడా భారీ యాక్షన్ మూవీనే అని తెలుస్తోంది. ఇక 'జీ 5' కోసం ఒక భారీ వెబ్ సిరీస్ ను కూడా ప్రవీణ్ డైరెక్ట్ చేయనున్నట్టుగా చెబుతున్నారు.