Venkatesh Daggubati: తమన్నాతో పెద్ద గొడవేం లేదు .. అసలేం జరిగిందంటే..: అనిల్ రావిపూడి

Anil Ravipudi Interview
షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్ 2' .. 'ఎఫ్ 3' సినిమాల్లో తమన్నా కథానాయికగా నటించింది. 'ఎఫ్ 3' సినిమా ప్రమోషన్స్ లో తమన్నా ఎక్కడా కనిపించలేదు. ఆమె పేరును ఎవరూ వేదికలపై ప్రస్తావించలేదు. దాంతో ఈ సినిమా టీమ్ తో తమన్నాకి ఏదో గొడవైందనీ .. అందువల్లనే ఆమె రాలేదనే ప్రచారం జోరుగానే జరిగింది.
 
తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో అనిల్ రావిపూడి ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "పెద్ద గొడవేం లేదు సార్. ఎక్కువమంది ఆర్టిస్టులతో పని చేసేటప్పుడు .. కాస్త వెనకా ముందు వచ్చే ఆర్టిస్టుల వలన అనుకోని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. అందువలన తమన్నా తన వర్క్ ను కొనసాగించవలసి వచ్చింది. ఆ కారణంగా అక్కడి వాతావరణం రెండు రోజుల పాటు కాస్త హీటెక్కింది.  

ఎక్కువమంది మంది ఆర్టిస్టుల కాంబినేషన్ కావడం వలన అలా చేయక తప్పలేదు. సాధారణంగా  ఇలాంటివి జరిగినప్పుడు నేను కలుపుకుపోతూనే ఉంటాను. తను కూడా ఆ విషయాన్ని అంతటితో వదిలేసింది. తను ప్రమోషన్స్ కి రాకపోవడానికి అది కారణం కాదు .. తను ఊళ్లో లేదంతే" అని చెప్పుకొచ్చాడు. 'ఎఫ్ 4'లో  హీరోయిన్స్ మార్పు ఉండొచ్చని ఆయన చెప్పడం కొసమెరుపు.
Go Back to Shorts
Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi

More Telugu News