Ram: రామ్ - బోయపాటి సినిమా లాంచ్!

  • రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
  • ఆ తరువాత సినిమా బోయపాటితో 
  • ఈ రోజునే పట్టాలెక్కిన ప్రాజెక్టు
  • త్వరలో మొదలుకానున్న రెగ్యులర్ షూటింగ్  
Ram New Movie Started Today

రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో .. స్రవంతి బ్యానర్లో ఒక సినిమా రూపొందనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. బూరుగుపల్లి శివరామకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, స్రవంతి రవికిశోర్ క్లాప్ ఇవ్వగా .. ముహూర్తపు షాట్ ను బోయపాటి చిత్రీకరించారు.

రామ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా బోయపాటి రెడీ చేసిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేయనున్నారు. కెరియర్ పరంగా రామ్ కి ఇది 20వ సినిమా. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక .. పూజ హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. 

 ఈ సినిమా  కంటే ముందుగా లింగుసామి దర్శకత్వంలో రామ్ 'ది వారియర్' సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి అలరించనుంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'అఖండ' తరువాత బోయపాటి చేస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి.

More Telugu News