సామాజిక న్యాయం కోసం... లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలి: పవన్ కల్యాణ్
- డాక్టర్ కె.లక్ష్మణ్ కు రాజ్యసభ చాన్స్
- నేడు లక్నోలో నామినేషన్ల దాఖలు
- యూపీ నుంచి రాజ్యసభకు పోటీ
- అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
విద్యార్థి దశ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన లక్ష్మణ్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు అందించిన సేవలు ఆయను మరింత ముందుకు తీసుకెళ్లాయని వివరించారు. సామాజిక న్యాయం మాటలకు, రాజకీయ అవసరాలకు పరిమితం కాకుండా ఉండాలంటే లక్ష్మణ్ వంటి ఉన్నత విద్యావంతులు పెద్దల సభలో ఉండాలని పవన్ కల్యాణ్ అభిలషించారు. లక్ష్మణ్ గారు ఆ దిశగా తన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తారనే విశ్వాసం ఉందని తెలిపారు. లక్ష్మణ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.