ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా సౌదీ ఆరాంకో
- ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- భారీగా పెరిగిన చమురు ధరలు
- విపరీతంగా లాభపడిన సౌదీ ఆరాంకో షేర్లు
- 2.43 ట్రిలియన్ డాలర్లకు పెరిగిన సంపద
- తగ్గిన ఆపిల్ షేర్ విలువ
ఇక, గతంలో ఓ మోస్తరు కంపెనీగా ఉన్న సౌదీ ఆరాంకో 2019లో పబ్లిక్ ఇష్యూకి వెళ్లాక సంస్థకు దశ తిరిగిపోయింది. ఆ కంపెనీ సంపద ఒక్కసారిగా 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.
ఈ ఏడాది ఆరంభంలో రష్యా... ఉక్రెయిన్ దండయాత్రకు దిగడంతో ఆ ప్రభావం చమురు రంగంపైనా పడింది. రష్యా నుంచి ముడిచమురు దిగుమతికి ఆంక్షలు అడ్డొచ్చాయి. దాంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. క్రూడాయిల్ ధరలు 36 శాతం పెరిగాయి. సింగిల్ బ్యారెల్ ధర 106.2 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలో సౌదీ ఆరాంకో షేర్ల విలువ 27 శాతం శాతానికి ఎగిసింది. అదే సమయంలో జనవరి నుంచి ఆపిల్ సంస్థ షేర్ల విలువలో 17 శాతం క్షీణత నమోదైంది.