TDP: పుల్లూరు టోల్ గేట్ వ‌ద్ద హైటెన్ష‌న్‌.. నారాయ‌ణ అరెస్ట్‌కు నిర‌స‌న‌గా భారీగా చేరుకున్న విద్యా సంస్థ‌ల సిబ్బంది, టీడీపీ శ్రేణులు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆయ‌న‌ను హైద‌రాబాద్ నుంచి రోడ్డు మార్గం మీదుగా చిత్తూరు త‌ర‌లిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం తెలుసుకున్న నారాయ‌ణ విద్యా సంస్థ‌ల‌కు చెందిన సిబ్బందితో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌ల‌కు తెర తీశాయి. అయితే ఈ స‌మాచారం బ‌హిర్గతం అయ్యేలోగానే నారాయ‌ణ‌ను ఏపీ పోలీసులు హైద‌రాబాద్ దాటించేశారు. 

అయితే ఈ క్ర‌మంలో క‌ర్నూలులోని నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌కు చెందిన సిబ్బంది... తమ అధినేత అరెస్ట్‌కు నిర‌స‌న‌గా హైద‌రాబాద్‌- బెంగ‌ళూరు జాతీయ ర‌హ‌దారిపై క‌ర్నూలు స‌మీపంలో ఉన్న పుల్లూరు టోల్‌గేటుకు చేరుకున్నారు. నారాయ‌ణ‌ను త‌ర‌లిస్తున్న పోలీసుల‌ను నిలువ‌రించి నిర‌స‌న తెలిపేందుకే వారంతా అక్క‌డికి చేరుకున్నార‌న్న స‌మాచారంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నాయి. దీంతో అక్క‌డ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు వారిని త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.
Go Back to Shorts
TDP
P Narayana
AP Police
Pullur Toll Plaza

More Telugu News