TDP: నారాయ‌ణ అరెస్ట్ ముమ్మాటికీ క‌క్ష‌పూరిత‌మే: చంద్ర‌బాబు

  • ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వం విఫ‌లమైందన్న బాబు 
  • వైఫ‌ల్యాన్ని క‌ప్పిపుచ్చునేందుకే నారాయ‌ణ అరెస్ట్‌ అని విమర్శ 
  • నోటీసుల్లేకుండా అరెస్ట్ అంటే క‌క్ష‌పూరితం కాదా అన్న చంద్ర‌బాబు
chandrababu fires on narayana arrest

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, నారాయ‌ణ విద్యా సంస్థ‌ల అధినేత పొంగూరు నారాయ‌ణ అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు స్పందించారు. నారాయ‌ణ అరెస్ట్ ముమ్మాటికీ క‌క్ష‌సాధింపేన‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించిన చంద్ర‌బాబు... ఆ  వైఫ‌ల్యాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకే నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసింద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ముంద‌స్తు నోటీసు ఇవ్వ‌కుండా అరెస్ట్ చేయ‌డం అంటే క‌క్ష‌పూరిత చ‌ర్య కాదా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

More Telugu News