Dulquer Salmaan: 'సీతా రామమ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!

  • ' సీతా రామమ్'గా దుల్కర్
  • ముఖ్యమైన పాత్రలో రష్మిక 
  • ఇళయరాజా తరహా బాణీ 
  • ఎస్పీ బాలును గుర్తు చేసిన చరణ్  
Sitha Ramam Movie song released

దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించాడు. వైజయంతీ మూవీస్ - స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించగా, రష్మిక కీలకమైన పాత్రలో కనిపించనుంది.

విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. 'హో సీతా వదలనిక తోడవుతా .. రోజంతా వెలుగులిడు నీడవుతా' అంటూ ఈ పాట సాగుతోంది. 1980 లోని పాటల తరహాలో .. ఇళయరాజా వరుసల్లో ఈ పాటకి బాణీ కట్టడం కనిపిస్తుంది. 

అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా ఎస్పీ చరణ్ - రమ్య బెహ్రా ఆలపించారు. బాలు తరహాలో చరణ్ ఈ పాట పాడినట్టుగా అనిపిస్తుంది. తెలుగు .. మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. 'అందాల రాక్షసి' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన హను రాఘవపూడి, ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.

More Telugu News