అభినంద‌న‌లు చెప్పిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు: కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు

Himanshu Rao Kalvakuntla thanks all who greets him
  • ఓక్రిడ్జి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్లో చ‌దువుతున్న హిమాన్షు
  • గ‌త వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీఏఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక‌
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం
తాను చదివే స్కూల్‌లో జ‌రిగిన‌ ఎన్నిక‌ల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సీఎం కేసీఆర్ మ‌న‌వ‌డు, మంత్రి కేటీఆర్ కుమారుడు క‌ల్వ‌కుంట్ల హిమాన్షురావుకు ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. హైదరా‌బాద్‌లోని ఓక్రిడ్జి ఇంట‌ర్నేష‌నల్ స్కూల్‌లో చ‌దువుతున్న హిమాన్షు... గ‌త వారం జ‌రిగిన ఎన్నిక‌ల్లో సీఏఎస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు చాలా మంది అభినంద‌న‌లు తెలుపుతున్నారు. తాజాగా త‌న‌కు అభినంద‌న‌లు చెప్పిన వారంద‌రికీ హిమాన్షు సోమ‌వారం ఉద‌యం ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. త‌న‌కు ఆది నుంచి మ‌ద్దతుగా నిలిచిన వారంద‌రికి కూడా ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మీ దీవెన‌ల‌తోనే ప్ర‌భావిత‌మ‌య్యాన‌న్న హిమాన్షు.. తాను మ‌రింతగా శ‌క్తిమంతం అయ్యేలా అంద‌రి దీవెన‌లు త‌న‌కు ఎల్ల‌ప్పుడూ తోడుంటాయ‌ని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Himanshu Rao Kalvakuntla
TRS
Telangana
oakridge international school

More Telugu News