మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ శెట్టిబలిజ సంఘం డిమాండ్
- మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభ
- హాజరైన వైవీ సుబ్బారెడ్డి, మంత్రి చెల్లుబోయిన
- వైవీ ముందు మోకరిల్లిన మంత్రి
- శెట్టిబలిజలుగా శిరసు వంచి నమస్కరిస్తున్నామని ప్రకటన
దీన్ని శెట్టిబలిజ సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. శెట్టిబలిజల పరువు తీశారంటూ మంత్రిపై మండిపడింది. కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నేడు శెట్టిబలిజ సంఘం నేతలు సమావేశమై మంత్రి వేణుగోపాలకృష్ణ తీరుపై చర్చించారు. పి.గన్నవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఓ మంత్రి హోదాలో ఉంటూ కూడా మోకరిల్లి, శెట్టిబలిజ కులం పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శెట్టిబలిజ జాతికి మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే శెట్టిబలిజ జాతి గుణపాఠం చెబుతుందని ఆ సంఘం నేతలు స్పష్టం చేశారు.