జగన్ జేబు నుంచి ఇచ్చిన డబ్బులతో బతుకుతున్నామా అంటున్న ఆడబిడ్డలకు ఏం సమాధానం చెబుతారు?: చంద్రబాబు
- కోడుమూరు ఎమ్మెల్యేను చుట్టుముట్టిన మహిళలు
- ఆ మహిళల ధైర్యానికి వందనం అంటూ చంద్రబాబు పోస్టు
- ఎమ్మెల్యేలను సైతం నడిరోడ్డుపై నిలదీస్తున్నారని వెల్లడి
జగన్ జేబు నుంచి ఇచ్చారా? అసలు దోచింది ఎంత? ఇచ్చింది ఎంత? మేం వాటితో బతుకుతున్నామా? అంటున్న ఆడబిడ్డలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, తాము పడుతున్న కష్టాన్ని వివరిస్తూ ప్రశ్నించిన ఆ సోదరి తెగువ అందరికీ స్ఫూర్తి కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఓ మహిళ ఆక్రోశం వెలిబుచ్చిన వైనాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు. అంతేకాదు, నడిరోడ్డుపై కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ను చుట్టుముట్టిన మహిళలు ఆయనను నిలదీసిన వైనం పత్రికల్లో రాగా, ఆ కథనాన్ని కూడా చంద్రబాబు పంచుకున్నారు.