నడిరోడ్డుపై యువకుడిని కర్రతో చితగ్గొట్టిన ఏపీ యువతి.. వీడియో వైరల్
- యువతి బైకుపై వెళ్తుండగా యువకుడు ఫాలో అయిన వైనం
- అందరిముందూ యువకుడికి బుద్ధి చెప్పిన యువతి
- ఆమెపై ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రశంసలు
గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడని ఆమె అందులో వివరించారు. సదరు పోకిరిని యువతి కర్రతో చితకబాదిందని చెప్పారు. ఆ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.
కాగా, వేధింపులకు గురిచేసిన ఆ యువకుడిని కింద పడేసి ఆ యువతి కర్రతో కొడుతుండగా ఆ పోకిరీ భయంతో వణికిపోయాడు. పోకిరీలు ఇలా వేధింపులకు గురి చేస్తోంటే ఆడవాళ్లు బయట ఎలా తిరగగలుతారని ప్రశ్నిస్తూ యువతి అందరి ముందూ ఆ యువకుడిని చితకబాదింది.