Jeevitha: మ‌మ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డంలేదు: జీవిత

Jeevitha reacts to news articles
షార్ట్స్‌లో చూడండి
రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ చిత్రం రిలీజ్ పోస్టర్ ను చిత్ర దర్శకురాలు జీవిత విడుదల చేశారు. శేఖర్ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. ఈ సందర్భంగా జీవిత సినిమాయేతర విషయాలపైనా స్పందించారు. తమపై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం చేస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చారు. అంతేకాదు, సోషల్ మీడియాలో తమపై పలు విధాలుగా థంబ్ నెయిల్స్ ఉపయోగించి దుష్ప్రచారం చేయడాన్ని ఖండించారు. అసలు, తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడంలేదని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. 

"ఒక‌ప్పుడు `మా` ఎల‌క్ష‌న్ సంద‌ర్భంగా మా కుటుంబం పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇలా ప‌లు సంద‌ర్భాల్లో మ‌మ్మ‌ల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావ‌డంలేదు. మా మీద కొందరు పనిగట్టుకుని తప్పుడు భావన కలిగేలా సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. అదేవిధంగా నిహారిక, మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి కూడా చాలా దారుణమైన వార్తలను ట్రోల్ చేస్తున్నారు. మా కుమార్తెల గురించి రకరకాల వార్తలను రాశారు. అవన్నీ మానసికంగా ఎంతో బాధకు గురిచేస్తున్నాయి" అని వాపోయారు. 

అయితే, తాను పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు పోతానని, నచ్చని వారెవరో వెనక నుండి ఇలాంటి పనులు చేస్తుంటారని ఆమె చెప్పారు.

వివాదంపై 'శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ ఏమన్నారంటే...

జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వరరాజు మీద 2017లో డీమాటైజేషన్ కేసు ఉందని, పోలీసుల కళ్లు గప్పి ఆయన తిరుగుతున్నారని ‘శేఖర్’ నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. అసలు రూ.26 కోట్లు ఎక్కడ నుండి తెచ్చి ఇచ్చారో కోటేశ్వరరాజు నిరూపించుకోవాల్సి ఉంటుందని శ్రీనివాస్ అన్నారు. జీవితకు కోటేశ్వరరాజుకు మధ్య ఉన్న వివాదంలోకి తమ ఫైనాన్షియర్ బీరం సుధాకర్ రెడ్డి పేరు తీసుకురావడం దారుణమని చెప్పారు.
Go Back to Shorts
Jeevitha
Sekhar
Rajasekhar
Allegations

More Telugu News