Samantha: నేను మౌనంగా ఉన్నానంటే తప్పు అంగీకరించానని కాదు: సమంత
ఇటీవల నాగచైతన్య నుంచి విడిపోయాక సమంత సోషల్ మీడియాలో ఏ కామెంట్ చేసినా విపరీతమైన ఆసక్తి కలిగిస్తోంది. తాజాగా ఆమె బౌద్ధ మత గురువు దలైలామా కొటేషన్ ను ఉదహరించి మరోసారి కలకలం రేపారు.
"నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడం లేదని కాదు, తప్పును అంగీకరించానని కాదు. నా దయార్ద్ర హృదయాన్ని బలహీనతగా భావించవద్దు. క్షమా గుణానికి కూడా ఓ ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ పోస్టు నేపథ్యంలో నెటిజన్లు తలోరకంగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆమె ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించింది చేసిందో అంటూ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం సమంత 'కాథవాకుల రెండు కాదల్' సినిమా ప్రమోషన్ ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.