ఓడిపోయినా కేకేఆర్ వెన్ను తట్టిన షారూక్ ఖాన్
- అందరూ బాగా ఆడారన్న షారుక్
- అద్భుతంగా కృషి చేశారంటూ ప్రశంస
- ఇలానే పోరాడాలి అంటూ ట్వీట్
‘‘చాలా చక్కగా ఆడారు. శ్రేయాస్ అయ్యర్, ఆరోన్ పింఛ్, ఉమేష్ యాదవ్ అద్భుతంగా కృషి చేశారు. 150వ మ్యాచ్ సందర్భంగా సునీల్ నెరైన్ కు అభినందనలు. మనం మ్యాచ్ కోల్పోయామని తెలుసు. అయినా, ఒకవేళ కిందకు వెళ్లాల్సి వచ్చినా ఇలానే పోరాడాల్సి ఉంటుంది. మీరు తల ఎత్తుకునే ఉండాలి’’ అంటూ షారూక్ ఖాన్ ట్వీట్ చేశాడు.