ఢిల్లీ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన ఆ యువతి మృతి
- అక్షర్ధామ్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి
- 40 అడుగుల ఎత్తు నుంచి పడడంతో గాయాలు
- చికిత్స పొందుతూ మృతి
కిందనున్న కొందరు సీఐఎస్ఎఫ్ సిబ్బంది దుప్పటి సాయంతో ఆమె కిందపడిపోకుండా కాపుకాశారు. అయితే, దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడామె చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.