Vijay: 'బీస్ట్' విషయంలో పూజ హెగ్డేకి తప్పని ట్రోల్స్!

  • 'రాధేశ్యామ్'తో నిరాశ పరిచిన పూజ 
  • నిన్ననే విడుదలైన 'బీస్ట్'
  • గ్లామర్ పరంగా మంచి మార్కులు 
  • నటనకు అవకాశమే లేని పాత్ర     
Beast Movie Update

పూజ హెగ్డే సినిమాలు వరుసగా థియేటర్స్ కి వస్తున్నాయి. ఆమె చేసిన భారీ సినిమాలు లైనుగా థియేటర్లలో దిగిపోతుండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధే శ్యామ్' ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. దాంతో ఆమె అభిమానులంతా 'బీస్ట్'పై దృష్టి పెట్టారు.

విజయ్ సరసన నాయికగా పూజ హెగ్డే చేసిన ఈ సినిమా, భారీ స్థాయిలో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పూజ చాలా గ్లామరస్ గా కనిపించింది. విజయ్ చేసే యాక్షన్ .. కమెడియన్స్ చేసే కామెడీని చూస్తుండటం తప్ప ఆమె ఏమీ చేసే అవకాశం లేకుండా పోయింది. 

దాంతో 'ఈ మాత్రం పాత్ర కోసమేనా పూజ ఇంత హడావిడి చేసింది? ఇంటర్వ్యూలలో పూజ చేసిన సందడి చూసి ఆమె పాత్ర గురించి ఏవేవో ఊహించుకున్నాం' అంటూ నెటిజెన్స్ ట్రోల్ చేస్తున్నారు.  ఇక ఇటీవల 'ఆర్ ఆర్ ఆర్'లో 'సీత' పాత్ర విషయంలో అలియా భట్ కి కూడా ఇలాంటి ట్రోల్స్ తప్పలేదనే సంగతి తెలిసిందే.

More Telugu News