'ఆచార్య' నుంచి న్యూ పోస్టర్ రిలీజ్!
- 'ఆచార్య'గా చిరంజీవి
- మణిశర్మ పాటలకు మంచి మార్కులు
- ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్
- 29వ తేదీన సినిమా విడుదల
ఈ నెల 12వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. మరోసారి అదే విషయాన్ని గుర్తుచేస్తూ, చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరూ సరసన కాజల్ .. చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనున్న ఈ సినిమాలో, రెజీనా స్పెషల్ సాంగులో మెరవనుంది. ముఖ్యమైన పాత్రల్లో సోనూ సూద్ .. సంగీత .. అనసూయ కనిపించనున్నారు.