Bunny: సెర్బియాలో బన్నీ పుట్టినరోజు వేడుకల్లో ఆసక్తికర దృశ్యం... వీడియో చూడండి!

  • పుష్ప విజయంతో బన్నీలో ఉత్సాహం
  • అదే ఊపులో పుట్టినరోజు సంబరాలు
  • సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో వేడుకలు
  • 50 మందితో తరలి వెళ్లిన ఐకాన్ స్టార్
Bunny birthday bash in Serbian capital Belgrade

పుష్ప ది రైజ్ అందించిన ఘనవిజయం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. పుష్ప విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే పుట్టినరోజు రావడంతో బన్నీ జోష్ అంబరాన్నంటింది. కుటుంబ సభ్యులు సహా 50 మంది సన్నిహితులతో సెర్బియా తరలి వెళ్లిన బన్నీ బెల్ గ్రేడ్ లో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా వెల్లడైంది. 

ఓ రెస్టారెంట్ లో బన్నీ మిత్రబృందం కేరింతలు కొడుతుండగా, రెస్టారెంట్ సిబ్బంది ఖరీదైన మద్యం బాటిళ్లను మోసుకుని రావడం హైలైట్ గా నిలిచింది. బాణసంచా వెలుగు జిలుగుల మధ్య మద్యం బాటిళ్లకు సంబంధించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

More Telugu News