ఢిల్లీ చేరిన ర‌ష్యా విదేశాంగ మంత్రి.. రేపు మోదీ, జైశంక‌ర్‌ల‌తో కీల‌క భేటీ

Sergei Lavrov reached new delhi
  • చైనా మీదుగా భార‌త్ చేరిన లావ్‌రోవ్‌
  • యుద్ధంపై వెన‌క్కి త‌గ్గిన మ‌రునాడే ఢిల్లీ వ‌చ్చిన మంత్రి
  • వివిధ దేశాల ఆంక్ష‌ల‌పై చ‌ర్చించే అవ‌కాశం
ర‌ష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్జీ లావ్‌రోవ్ కాసేప‌టి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. ర‌ష్యా నుంచి చైనా వెళ్లిన లావ్‌రోవ్‌..అక్క‌డి నుంచి భార‌త్ కు వ‌చ్చారు. రెండు రోజుల పాటు భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న లావ్‌రోవ్‌.. శుక్ర‌వారం నాడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. అంత‌కుముందే భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌తోనూ ఆయ‌న భేటీ అవుతారు. 

ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంపై తొలిసారి కాస్తంత వెన‌క్కు త‌గ్గిన‌ట్టు కనిపించిన మ‌రుక్ష‌ణ‌మే బుధ‌వారం నాడు లావ్‌రోవ్ భార‌త ప‌ర్య‌ట‌న ఖ‌రారైన సంగ‌తి తెలిసిందే. యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యాపై ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యంపై మోదీతో లావ్‌రోవ్ చ‌ర్చించే అవ‌కాశాలున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Russia
Ukraine
New Delhi
Sergeĭ Lavrov

More Telugu News