Balakrishna: బాలయ్య 107వ సినిమా టైటిల్ ఆ రోజున చెప్పేస్తారట!

  • సెట్స్ పై బాలకృష్ణ 107వ సినిమా 
  • కథానాయికగా శ్రుతి హాసన్ 
  • కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లింది. రాయలసీమ నేపథ్యంలో ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 

ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. 'ఉగాది' పండుగ సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. అలాగే ఫస్టు గ్లింప్స్ ను కూడా వదలనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలతో బిజీగా ఉన్నారని అంటున్నారు. 

ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని చెబుతున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, పవర్ఫుల్ ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. ఈ దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News