Manchu Manoj: హీరో మంచు మ‌నోజ్ న‌డుపుతోన్న‌ కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు.. బ్లాక్ ఫిల్మ్ తొల‌గింపు

manchu manoj gets challan
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు కొన్ని రోజులుగా ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌డుతోన్న విష‌యం తెలిసిందే. కార్ల‌కు బ్లాక్ ఫిల్మ్ , వాహ‌నాల‌పై పోలీస్, ప్రెస్ అని రాసుకుని ఉండ‌డం, నంబర్‌ ప్లేట్లు స‌రిగ్గా ఉండ‌క‌పోవ‌డం వంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డుతోన్న వారిని గుర్తించేందుకు ఈ డ్రైవ్ కొన‌సాగిస్తున్నారు. 

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులకు కూడా ఫైన్ విధించారు. ఇప్పుడు ట్రాఫిక్ పోలీసుల‌కు హీరో మంచు మ‌నోజ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొరికిపోయాడు. హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తోన్న స‌మ‌యంలో మనోజ్ కారు న‌డుపుతూ వెళ్తున్నాడు. 

ఆ కారును ఆపిన పోలీసులు దాని అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉంద‌ని, రూ.700 చలాన్ విధించారు. అలాగే, అద్దాల‌కు ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్ ను తొలగించారు. కాగా, ఇటీవలే జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్ రామ్‌ కార్ల‌ను కూడా త‌నిఖీ చేసిన పోలీసులు వాటికి ఉన్న‌ బ్లాక్ ఫిల్మ్‌ ను తొలగించి చలానాలు విధించారు.
Go Back to Shorts
Manchu Manoj
Tollywood
car
Hyderabad

More Telugu News