డీజీపీకి వర్ల రామయ్య లేఖ.. కొడాలి నానిపై విచారణకు డిమాండ్
- గుడివాడలో ప్రత్యేక రాజ్యాంగం అమలు
- కొడాలి నాని గుప్పిట్లో గుడివాడ
- క్యాసినోపై తీసుకున్న చర్యలేమిటన్న రామయ్య
- దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలలంటూ డిమాండ్
గుడివాడను గుప్పిట్లో పెట్టుకున్న కొడాలి నాని.. పట్టణంలో ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక చట్టం అమలు చేస్తున్నారని రామయ్య విమర్శించారు. అక్రమ క్యాసినో నిర్వహణపై తీసుకున్న చర్యలతో పాటు.. ఈ వ్యవహారంపై నూజివీడు డీఎస్పీ చేపట్టిన దర్యాప్తు నివేదికను బహిర్గతం చేయాలని వర్ల ఆ లేఖలో డిమాండ్ చేశారు.