అది వరుణ్ తేజ్ నే అడగాలి... అతడే చెప్పాలి: నాగబాబు

Nagababu chitchat with fans in social media
  • అభిమానులతో నాగబాబు చిట్ చాట్
  • వరుణ్ తేజ్ పెళ్లెప్పుడని అడిగిన ఓ అభిమాని
  • గతంలో ఇదే ప్రశ్నకు పలుమార్లు జవాబు చెప్పిన నాగబాబు
  • ఈసారి చెప్పలేక వరుణ్ తేజ్ పైకి నెట్టిన వైనం
టాలీవుడ్ లో ఇప్పుడున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో వరుణ్ తేజ్ ఒకడు. గద్దలకొండ గణేశ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నట విశ్వరూపం చూపించిన వరుణ్ తేజ్ కు అమ్మాయిల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ నటించిన గని, ఎఫ్3 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 

కాగా, వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తాజాగా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించగా, ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. వరుణ్ తేజ్ కు ఎప్పుడు పెళ్లి చేస్తున్నారు బ్రో? అంటూ నాగబాబును ప్రశ్నించారు. అయితే, ఇదే ప్రశ్న గతంలోనూ రావడంతో నాగబాబు ఏంచెప్పాలో తెలియక, ఈ ప్రశ్న వరుణ్ తేజ్ నే అడగాలని సూచించారు. అతడే సమాధానం చెబుతాడని పేర్కొన్నారు. 

వరుణ్ తేజ్ ప్రేమ, పెళ్లి అంటూ గతంలో అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ ప్రచారం వట్టిదేనని తేలిపోయింది. వరుణ్ తేజ్ పెళ్లిపై గతంలో పలు ప్రశ్నలు ఎదురైనప్పుడు నాగబాబు ఎంతో చమత్కారంగా స్పందించారు. మంచి సంబంధాలు ఉంటే చూడాలని నెటిజన్లకే చాయిస్ ఇచ్చారు. మరోసారి, ప్రేమ వివాహం చేసుకున్నా నో ప్రాబ్లమ్ అన్నారు. ఈసారి మాత్రం పెళ్లి విషయం వరుణ్ తేజ్ కే వదిలేశారు.
Go Back to Shorts
Nagababu
Social Media
Varun Tej
Marriage
Tollywood

More Telugu News