చండీగఢ్‌లో హోలీ వేడుక‌.. ద‌త్త‌న్న‌తో కలిసి పంజాబ్, హర్యానా సీఎంల సంబ‌రాలు
Add ap7am to your home Screen

చండీగఢ్‌లో హోలీ వేడుక‌.. ద‌త్త‌న్న‌తో కలిసి పంజాబ్, హర్యానా సీఎంల సంబ‌రాలు

dandaru dattatreya with haryana and punjab cms in holi festival
  • వేడుక‌ల్లో హ‌ర్యానా, పంజాబ్ సీఎంలు ఖట్ట‌ర్‌, మాన్‌
  • ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ ద‌త్త‌న్న‌
  • రాజ‌కీయాలు మ‌రిచి ఉల్లాసంగా పాల్గొన్న వైనం
దేశంలో రంగుల కేళి హోలీ వేడుక‌లు మొద‌లైపోయాయి. దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ వేడుక‌లు ఉల్లాసంగా సాగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా హ‌ర్యానా, పంజాబ్ ఉమ్మ‌డి రాజ‌ధాని చండీగ‌ఢ్‌లో జ‌రిగిన వేడుక‌ల్లో హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌ బండారు ద‌త్తాత్రేయ‌, రెండు రాష్ట్రాల సీఎంలు మనోహర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, భ‌గ‌వంత్ మాన్ లు ఉమ్మ‌డిగా వేడుక‌ల్లో పాలుపంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీకి చెందిన‌ ఖ‌ట్ట‌ర్, ఆప్‌కు చెందిన భ‌గ‌వంత్ మాన్ ఒక‌రికొక‌రు రంగులు పూసుకుని వేడుక చేసుకున్నారు. అదే స‌మ‌యంలో బండారు ద‌త్తాత్రేయ కూడా ఈ వేడుక‌ల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా రెండు వేర్వేరు పార్టీల‌కు చెందిన నేత‌లు ఉల్లాసంగా వేడుక‌ల్లో పాలుపంచుకున్న వైనం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
Bhagavanth Mann
Manohar Lal Khattar
Bandaru Dattatreya
Haryana Governer

More Telugu News