ఆవిడ కష్టాల్లో ఉన్నప్పుడు లెక్కలు మాట్లాడితే ఎలా విజయసాయిరెడ్డీ?: బుద్ధా వెంకన్న కౌంటర్

Budda Venkanna counter to Vijaysai Reddy
  • సోనియాకు చంద్రబాబు పాలేరు పనిచేశాడన్న విజయసాయి
  • సోనియాకు పెద్ద పాలేరు వైఎస్సారేనన్న వెంకన్న 
  • సోనియా ముష్టి తిని తెగబలిశారని వ్యాఖ్యలు
వైఎస్ జగన్ ను జైలు పాలు చేసే క్రమంలో చంద్రబాబు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పెద్ద పాలేరులా పనిచేశాడంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అదేస్థాయిలో బదులిచ్చారు. 

సోనియా గాంధీకి పెద్ద పాలేరు మీ మహామేత వైఎస్సార్ అని మర్చిపోతే ఎలా విజయసాయిరెడ్డీ... అంటూ ట్వీట్ చేశారు. ఆవిడ పడేసిన ముష్టి తినేగా మీరంతా ఇంత బలిసింది అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉండగానే లెక్కలు మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి సీఎం పదవి కోసం తండ్రి శవం ఉండగానే సోనియా గాంధీకి రాయబారం తీసుకెళ్లిన నీచజాతి నీది సాయిరెడ్డీ అంటూ బుద్ధా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Budda Venkanna
Vijay Sai Reddy
Chandrababu
YSR
Sonia Gandhi
Jagan
Andhra Pradesh

More Telugu News