వారణాసిలో బూత్ కార్యకర్తలతో మోదీ మీటింగ్.. చాలా కుర్చీలు ఖాళీ!
- ‘బూత్ విజయ్ సమ్మేళన్’ కార్యక్రమం
- 3361 బూత్‌ల నుంచి 20 వేల మందికిపైగా హాజరవుతారని అంచనా
- ప్రసంగం ఆలస్యం కావడంతో ఒక్కొక్కరుగా జారుకున్న వైనం
- వెళ్లిపోవడానికి ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పిన తీరు
కార్యక్రమానికి హాజరైన వారందరూ వెనుదిరగడంతో వందలాది కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వేదిక నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో సాకు చెప్పడం గమనార్హం. బూత్ అధికారి సన్నీసింగ్ మాట్లాడుతూ.. అత్యవసర సమావేశానికి వెళ్లాల్సి ఉందని, మళ్లీ వస్తానని చెప్పారు.
కార్యకర్తలు వెనుదిరగడంపై సోమనాథ్ మౌర్య మాట్లాడుతూ.. మధ్యాహ్నం నుంచి ప్రజలు వేదిక వద్ద ఉన్నారని ఆకలి, దాహంతో అలమటించడంతో కొందరు, బహిర్భూమికి మరికొందరు వెళ్లారని అన్నారు. అలా వెళ్లినవారంతా తిరిగి వెనక్కి వస్తారని అన్నారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మోనికా పాండే కూడా సభ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. తన కుమార్తెకు పరీక్షలు ఉండడంతో ఆమెను దింపేందుకు వెళ్లానని, తిరిగి వస్తానని చెప్పారు. యూపీలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ సాక్షాత్తూ ప్రధాని మోదీ సమావేశం ఇలా వెలవెలబోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.