తెలంగాణలో మరో 569 మందికి కొవిడ్ పాజిటివ్

Telangana Covid daily report
  • గత 24 గంటల్లో 51,518 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు
  • ఇంకా 8,379 మందికి చికిత్స
తెలంగాణలో గత 24 గంటల్లో 569 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 51,518 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 133 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, నల్గొండ జిల్లాలో 33 కేసులు వెలుగు చూశాయి.

అదే సమయంలో 2,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో కరోనా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,84,631 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,72,145 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,379 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
COVID19
Today Cases

More Telugu News