షూటింగు పూర్తిచేసుకున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
- కిశోర్ తిరుమల నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
- శర్వానంద్ సరసన నాయికగా రష్మిక
- హాస్యప్రధానంగా సాగే కథాకథనాలు
- ఈ నెల 25వ తేదీన విడుదల
ఇంతవరకూ కూడా ఎప్పటి పనులను అప్పుడు పూర్తిచేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ను బట్టే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమైపోతోంది.
హీరో పెళ్లి చూపుల ఎపిసోడ్ ఈ సినిమాలో ప్రధానమైన హాస్యాన్ని పండించనుంది. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనుకబడిన శర్వానంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.