శిల్పాశెట్టి పేరిట ఆస్తులను బదలాయించిన రాజ్ కుంద్రా
- ఐదు ఫ్లాట్స్ భార్య పేరిట మార్పిడి
- వీటి విలువ రూ.35 కోట్లు
- 1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లింపు
- ప్రస్తుత నివాసం అక్కడే
జుహూలోని గాంధీగ్రామ్ రోడ్డులో సముద్ర తీరానికి 300 మీటర్ల దూరంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. కుంద్రా దంపతులు ప్రస్తుతం ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇందులో మొదటి అంతస్తులోని ఐదు ఫ్లాట్స్ కుంద్రా పేరుమీదే ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు.
ప్రస్తుత మార్కెట్ విలువ ఒక్కో చదరపు అడుగు రూ.65,000గా ఉంది. ఈ లావాదేవీలో భాగంగా శిల్పాశెట్టి రూ.1.9 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. తన పేరిట ఉన్న ఆస్తులను రాజ్ కుంద్రా భార్య పేరిట ఎందుకు మార్చారనే వివరాలు బయటకు రాలేదు.