Balakrishna: బాలయ్య రెగ్యులర్ షూటింగుకి డేట్ ఖరారు!

  • 'అఖండ'తో సంచలన విజయాన్ని అందుకున్న బాలకృష్ణ
  • ఓటీటీ నుంచి కూడా ఈ సినిమాకి భారీ రెస్పాన్స్
  • ఫిబ్రవరి 16 నుంచి పట్టాలెక్కుతున్న గోపీచంద్ మలినేని మూవీ
  • మూడు పాత్రల్లో కనిపించనున్న బాలయ్య  
  • రాయలసీమ సాగునీటి నేపథ్యంలో సాగే కథ    
Balakrishna in Gopichand Malineni movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. ఓటీటీ నుంచి కూడా ఈ సినిమా అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా కోసం రెడీ అవుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో .. ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

ఈ సినిమా రెంగ్యులర్ షూటింగుకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. వచ్చేనెల 16వ తేదీన ఫస్టు షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. బాలకృష్ణతో పాటు ముఖ్యమైన పాత్రధారులు ఈ షెడ్యూల్లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఈ కథ రాయలసీమ నేపథ్యంలో నడుస్తుందని అంటున్నారు. అక్కడి సాగునీటి సమస్య ప్రధానంగా కథ కొనసాగుతుందని చెబుతున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన సరసన ఒక కథానాయికగా శ్రుతిహాసన్ ను తీసుకున్నారు. ఇక విలన్ పాత్రకి గాను దునియా విజయ్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన సినిమాలన్నీ భారీ హిట్లుగా నిలిచాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News