Nara Lokesh: ఇత‌డిని ట్రాక్ట‌ర్‌తో తొక్కి చంపుతాన‌ని వైసీపీ నేత రెడ్డ‌న్న బెదిరించాడు: లోకేశ్

lokesh slams ycp
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిప‌డ్డారు. వైసీపీ నేత‌లు భూక‌బ్జాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు.

''చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండల కేంద్రం వాసి గుండ్లూరి ఇమామ్ ఖాసింకి చెందిన బొమ్మయ్యగారి పల్లె పంచాయతీలోని 2.85 ఎకరాల భూమిని వైసీపీ నాయకుడు నాగిశెట్టి రెడ్డన్న క‌బ్జా చేసి త‌న బినామీ పేరుతో బోగ‌స్ ప‌ట్టా చేయించుకోవ‌డం రాష్ట్రంలో వైసీపీ క‌బ్జాల‌కి పరాకాష్ఠగా నిలిచింది.

త‌న భూమిలోకి ఎందుకొచ్చార‌ని ఖాసిం నిల‌దీస్తే, ట్రాక్ట‌ర్‌తో తొక్కి చంపుతాన‌ని వైసీపీ నేత రెడ్డ‌న్న బెదిరించ‌డం మైనార్టీలకు వైసీపీ పాల‌న‌లో ర‌క్ష‌ణ‌ లేద‌ని తేలిపోయింది. ఖాసింకి ఏం జ‌రిగినా వైసీపీ ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌'' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News