Raviteja: దూసుకుపోతున్న 'ఖిలాడి' సాంగ్!

  • 'ఖిలాడి'గా రవితేజ
  • దర్శకుడిగా రమేశ్ వర్మ
  • పాటలకి మంచి రెస్పాన్స్
  • ఫిబ్రవరి 11వ తేదీన సినిమా విడుదల
Khiladi movie update

రవితేజ - రమేశ్ వర్మ కాంబినేషన్లో 'ఖిలాడి' సినిమా రూపొందింది. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కథానాయికలుగా అందాల సందడి చేయనున్నారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ .. ఆయన ఎనర్జీ .. ఆయనకి గల మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించినట్టుగా దర్శకుడు చెబుతున్నాడు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఆయన బాణీలను సమకూర్చిన మూడు సింగిల్స్ ను వదలగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రీసెంట్ గా ఫోర్త్ సింగిల్ గా 'ఫుల్ కిక్కు' అనే పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ బీట్ కి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా సాగర్ ఆలపించాడు.

యూ ట్యూబ్ లో ఈ పాటను ఇలా వదలడమే ఆలస్యం అలా దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ సాంగ్ 4 మిలియన్ ప్లస్ వ్యూస్ ను, 1.6 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. రవితేజ - డింపుల్ హయతిపై చిత్రీకరించిన ఈ పాట అదే ఊపును కొనసాగిస్తూ ట్రెండింగులో నిలవడం విశేషం. భారీ తారాగణం నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.

More Telugu News