నాని 'దసరా' కోసం 12 కోట్లతో విలేజ్ సెట్!

Dasara movie upadate
  • 'శ్యామ్ సింగ రాయ్'తో హిట్ కొట్టిన నాని
  • షూటింగు పూర్తిచేసుకున్న 'అంటే సుందరానికీ'
  • షూటింగు దశలో 'దసరా'
  • 12 ఎకరాల్లో 12 కోట్లతో భారీ సెట్  
నాని హీరోగా ఇటీవల వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' భారీ విజయాన్ని అందుకుంది. లుక్ పరంగా .. యాక్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ఆయనకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. ఆ తరువాత సినిమా అయిన 'అంటే .. సుందరానికీ' కూడా షూటింగును పూర్తి చేసుకుంది. వివేక్ ఆత్రేయ రూపొందించిన ఈ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకి నజ్రియా నజీమ్ పరిచయమవుతోంది.

ఆ తరువాత ప్రాజెక్టుగా 'దసరా' సెట్స్ పై ఉంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడు. అందుకోసం ఆయన ఒక ట్యూటర్ ను కూడా పెట్టుకున్నాడని అంటున్నారు.

ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో 12 ఎకరాల్లో ఒక విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నారని అంటున్నారు. 12 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్ నిర్మాణం నడుస్తోందని చెబుతున్నారు. ఈ సెట్లోనే ఎక్కువ భాగం షూటింగు జరుగుతుందట. ఈ సెట్ కోసం 'కడియం' నుంచి పెద్ద ఎత్తున వివిధ రకాల మొక్కలను తెప్పిస్తున్నారని అంటున్నారు. 'నేను లోకల్' తరువాత నానితో కలిసి కీర్తి సురేశ్ చేస్తున్న సినిమా ఇది.
Go Back to Shorts
Nani
Keerthi Suresh
Dasara Movie

More Telugu News