తెలంగాణలో ఒక్కరోజులో 4,559 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,13,670 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,450 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 36,269 మందికి చికిత్స
అదే సమయంలో 1,961 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,43,354 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,03,008 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 36,269 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 4,077కి పెరిగింది.
