మంత్రి కొడాలి నానిపై మరోసారి నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న
- కేసినో వ్యవహారంలో వైసీపీ వర్సెస్ టీడీపీ
- కొడాలి నానిపై టీడీపీ నేతల ఫైర్
- కొడాలి నాని ఆయిల్ దొంగ అంటూ బుద్ధా వ్యాఖ్యలు
కాగా, తన ఇంటికి పోలీసులు రావడంపైనా బుద్ధా స్పందించారు. ఏపీ పోలీసుల తీరు అత్యంత విచారకరం అని పేర్కొన్నారు. "విచ్చలవిడిగా క్యాసినో నడిపిస్తే నో పోలీస్... ప్రతిపక్ష నేతని మంత్రి కొడాలి నాని బూతులు తిట్టినా నో పోలీస్. నేను మీడియా సమావేశం పెట్టిన అరగంటకే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని అర్థమవుతోంది" అని వ్యాఖ్యానించారు.