తెలంగాణలో కొత్తగా 4,393 కొవిడ్ పాజిటివ్ కేసులు

Telangana covid update
  • గత 24 గంటల్లో 1,16,224 కరోనా టెస్టులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 1,643 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 31,199 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,16,224 శాంపిల్స్ పరీక్షించగా 4,393 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,643 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 421, రంగారెడ్డి జిల్లాలో 286, హనుమకొండ జిల్లాలో 184 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 2,319 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,31,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,95,942 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 31,199 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,071కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
COVID19
Update
Today Cases

More Telugu News