మమ్మల్ని ఆ దేవుడే కలిపాడు: బాలకృష్ణ
- డిసెంబర్ 2వ తేదీన వచ్చిన 'అఖండ'
- నిన్నటితో 50 రోజులు పూర్తి
- ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్
- హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో సెలబ్రేషన్స్
ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ .. 'అఖండ' పాన్ ఇండియా సినిమా కాదు .. పాన్ వరల్డ్ సినిమా అని నిరూపించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. భక్తికి సంధించిన ఎన్నో పాత్రలను నాన్నగారు పోషించారు. ఆయనను తలచుకుంటూ నటించడం వల్లనే ఈ సినిమాలోని నా పాత్రను అంత బాగా చేయగలిగాను. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.
బోయపాటి, నేను కలిసి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాము. మాది జన్మజన్మల బంధం .. ఆ దేవుడే మా ఇద్దరినీ కలిపాడు. ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు .. కర్ణాటక .. మహారాష్ట్రలోనే కాదు, ప్రపంచమంతా కూడా ఇప్పుడు 'అఖండ' అర్థశతదినోత్సవ వేడుక జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.