ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయం కేసు: ఇందులో తప్పేముందని పిటిషనర్ ను ప్రశ్నించిన హైకోర్టు
- ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ ప్రజలకు తెలుసు
- ఇందులో హక్కుల హరణ ఏముంటుంది?
- థియేటర్ల యాజమాన్యాన్ని ప్రశ్నించిన ధర్మాసనం
- విచారణ నాలుగు వారాలకు వాయిదా
సినిమా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించడంలో తప్పు ఏముందని, ఇందులో హక్కులను హరించేది ఏముంటుందని ప్రశ్నించింది. ప్రజలకు ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకోవడమే కాకుండా, ఆన్ లైన్లో సినిమా చూడడం కూడా తెలుసని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ పై స్పందన తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఫిల్మ్ టెలివిజన్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.