Nagarjuna: 'అందుకే నేను వెళ్ల‌లేదు'.. సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీపై నాగార్జున‌ స్పంద‌న‌

nagarjuna on chiru jagan meet
షార్ట్స్‌లో చూడండి
సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన అంశాల‌పై చర్చించేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌తో మెగాస్టార్ చిరంజీవి స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. వారి భేటీపై సినీన‌టుడు అక్కినేని నాగార్జున స్పందించారు. చిరంజీవి త‌న ఒక్క‌రికోస‌మే వెళ్ల‌లేదని, త‌మ అంద‌రి కోసమే ఏపీలోని తాడేప‌ల్లి వెళ్లి జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యార‌ని నాగార్జున చెప్పారు.

తాను న‌టించిన బంగార్రాజు సినిమా విడుద‌ల ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ వ‌ద్ద‌కు తాను వెళ్ల‌లేద‌ని ఆయ‌న తెలిపారు. జ‌గ‌న్‌తో స‌మావేశం ఉంద‌ని త‌న‌కు చిరంజీవి వారం రోజుల క్రిత‌మే చెప్పార‌ని ఆయ‌న అన్నారు. సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవికి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని నాగార్జున‌ చెప్పారు.
Go Back to Shorts
Nagarjuna
Chiranjeevi
Jagan

More Telugu News