మెగా మూవీలో రవితేజ ఖాయమైపోయినట్టే!

Raviteja in Chiranjeevi movie
  • 'వాల్తేరు వీర్రాజు'గా చిరంజీవి
  • తమ్ముడి పాత్ర కోసం రవితేజతో సంప్రదింపులు
  • ఆయన ఒప్పుకునే అవకాశం  
  • దర్శకుడిగా బాబీ
రవితేజ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు ఆన్ డ్యూటీ' .. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో 'ధమాకా' రెండూ కూడా షూటింగు దశలో ఉన్నాయి. ఆ తరువాత సినిమాగా 'రావణాసుర' రేపు పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేరు వీర్రాజు' ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. 'వాల్తేరు వీర్రాజు'కు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందట.

 ఆ పాత్రను రవితేజ చేస్తే బాగుటుందని భావించిన బాబీ, ఆయన కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడని అంటున్నారు. తెరపై ఈ పాత్ర నిడివి 40 నిమిషాల సేపు ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవి ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రవితేజ ఒప్పుకోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఈ సినిమా చేయడం ఖాయమేనని అంటున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Raviteja
Valtheru Veerraju Movie

More Telugu News