కొడాలి నాని ఎవరో నాకు తెలియదు: రామ్ గోపాల్ వర్మ
- టికెట్ల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వర్మ
- టికెట్ రేటును నిర్ణయించడానికి ప్రభుత్వం ఎవరని ప్రశ్న
- నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని మాత్రమే
మరోవైపు వర్మ వ్యాఖ్యలపై మరో మంత్రి కొడాలి నాని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో వర్మ స్పందిస్తూ... 'ఏపీ టికెట్ రేట్ల విషయంలో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని నేచురల్ స్టార్ నాని ఒక్కడే... వాళ్లు చెపుతున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు' అని ట్వీట్ చేశారు. వర్మ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించాల్సి ఉంది.