RK Beach: విశాఖ ఆర్కే బీచ్ లో విషాదం... విహారయాత్రకు వచ్చి ఇద్దరి మృతి

Two died at Vizag RK Beach
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన వారు మృత్యువాత పడ్డారు. హైదరాబాదు నుంచి ఏడుగురు యువకులు ఆర్కే బీచ్ కు వచ్చారు. స్నానానికి దిగగా, ఆ ఏడుగురిలో ముగ్గురు అలల తాకిడికి కొట్టుకుపోయారు. వారిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మృతి చెందిన యువకుడిని హైదరాబాదు బేగంపేటకు చెందిన సీహెచ్.శివ అని గుర్తించారు. గల్లంతైన ఇద్దరు కూడా బేగంపేటకు చెందినవారే.

అటు, ఒడిశా నుంచి ఒక యువతి, నలుగురు యువకులు కూడా ఆర్కే బీచ్ వద్దకు పిక్నిక్ కోసం వచ్చారు. వారిలో సుమిత్రా పాఠక్ అనే యువతి సముద్రపు అలల తాకిడికి మునిగిపోయి మరణించింది. సుమిత్రా పాఠక్ ఒడిశాలోని భద్రక్ జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు.
Go Back to Shorts
RK Beach
Tragedy
Vizag
Andhra Pradesh

More Telugu News