'శ్యామ్ సింగ రాయ్' మొదటివారం వసూళ్లు ఇవే!

Shyam Singha Roy movie update
  • క్రితం నెల 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
  • వసూళ్ల పరంగా తగ్గని జోరు
  • తెలుగు రాష్ట్రాల్లో 14.92 కోట్ల షేర్
  • ప్రపంచవ్యాప్తంగా 20.80 కోట్లు  
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా తెరకెక్కింది. క్రితం నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇది ఇంతవరకూ నాని చేస్తూ వచ్చిన కథలకు భిన్నం. అంతేకాకుండా బరిలో 'పుష్ప' జోరు మీద ఉండగా థియేటర్లకు వచ్చింది. అందువలన ఎలా ఆడుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది.

అయితే కథాకథనాలు .. నాని .. సాయిపల్లవి లుక్స్ .. కృతి శెట్టికి గల క్రేజ్ ఈ సినిమాకి కలిసొచ్చాయి. అంతేకాకుండా పాటలు కూడా జనాల్లోకి బాగా వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా వసూళ్లపై అందరిలో ఆసక్తి ఏర్పడటమనేది సహజం. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 25.28 కోట్ల గ్రాస్ ను .. 14.92 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, 20.80 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్లు పెద్దగా తగ్గలేదు. మరో వారం రోజుల పాటు వసూళ్ల జోరు కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మేకర్స్ అంటున్నారు. వాళ్ల అంచనాలను 'శ్యామ్ సింగ రాయ్' నిలబెడతాడేమో చూడాలి.
Go Back to Shorts
Nani
Sai Pallavi
Krithi Shetty
Shyam Singha Roy Movie

More Telugu News