వీరిద్దరి బయోపిక్ లలో నటించేందుకు నేను రెడీ: ధనుష్
- ఎవరి బయోపిక్ చేయాలనుందని ధనుష్ కు మీడియా ప్రశ్న
- రజనీ, ఇళయరాజా అంటే తనకు ఎంతో అభిమానమన్న ధనుష్
- వీరి బయోపిక్స్ లో నటించాలనే కోరిక ఉందని వ్యాఖ్య
ఈ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. బయోపిక్ లలో నటించాల్సి వస్తే ఎవరి బయోపిక్ లో నటిస్తారని మీడియా ప్రశ్నించగా... తనకు రజనీకాంత్, ఇళయరాజా అంటే ఎంతో అభిమానమని... వీరి బయోపిక్స్ లో నటించాలనే కోరిక ఉందని చెప్పారు. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీని మొదలుపెట్టాడు. తాజాగా మరో తెలుగు సినిమాకు కూడా ఓకే చెప్పాడు.