తెలంగాణలో మరో 185 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 41,484 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 78 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 3,761 మందికి చికిత్స
అదే సమయంలో 205 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,79,430 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,71,655 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,761 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,014కి పెరిగింది.
